యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చిత్రం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే...
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసాడని, ఓ స్టోరీ లైన్ వినిపించాడనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ స్టోరీ లైన్ చిరుకి బాగా నచ్చిందట. ఖచ్చితంగా ఈ సినిమా చేద్దామని మాటిచ్చారట చిరు. ప్రస్తుతం 'సైరా' నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న చిరు, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. దీని తర్వాత చిరు, త్రివిక్రమ్ సినిమా ఆరంభమవుతుందని సమాచారమ్. సో... అల్లు అర్జున్, ఆ తర్వాత చిరు సినిమాలతో త్రివిక్రమ్ బిజీ అవ్వబోతున్నాడు. అంటే ఆల్ మోస్ట్ 2020 వరకూ త్రివిక్రమ్ బిజీ అని చెప్పొచ్చు.