'ఎన్టీఆర్-కథానాయకుడు' లో అందాలతార జయప్రద పాత్రను మిల్క్ బ్యూటీ తమన్నా చేయబోతోందనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న వార్తలు ప్రకారం జయప్రద పాత్రను తమన్నా చేయడంలేదు. బబ్లీ బ్యూటీ హన్సిక చేయబోతోంది. త్వరలోనే హన్సిక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. ముందుగా బాలయ్య, హన్సిక లపై ఓ పాటను చిత్రీకరించబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
'ఆరేసుకోబోయి పారేసుకున్నా...' పాటలో ఎన్టీఆర్, జయప్రద మెరిసిన వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు 'ఎన్టీఆర్ - కథానాయకుడు' లో ఈ పాటను పొందుపరచబోతున్నారు. బాలయ్య, హన్సిక ఈ పాటకు చిందేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ మొత్తం ఉండదట. కేవలం ఒక చరణం మాత్రమే ఉంటుందట. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. మొత్తం మీద ఎన్టీఆర్' బయోపిక్ భారీ తారాగణంతో, భారీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.