ఈ రోజు (9.1.2019) తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఎన్టీఆర్ బయోపిక్' కి సంబంధించి ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది. లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను డైరెక్టర్ క్రిష్ ఎలా ఆవిష్కస్తారు... తండ్రి పాత్రలో నందమూరి నటసింహం బాలకృష్ఱ ఎలా ఒదిగిపోతారు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికిపోయాయి.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన వైనానికి జేజేలు కొడుతున్నారు. సినిమాని మలచిన తీరుకు డైరెక్టర్ క్రిష్ కు నమస్కారాలు పెడుతూ తమ మర్యాదను చాటుకుంటున్నారు. నందమూరి అభిమానులైతే నోటి మాటలురాక 'మా జన్మ ధన్యం' అని ఉప్పొంగిపోతున్నారు. ఓ మహానుభావుడికి ఘననివాళి ఈ సినిమా అని సినీప్రియులు కొనియాడుతున్నారు. విమర్శకులు సైతం 'గ్రేట్ ట్రిబ్యూట్ టు లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్' అని ఈ సినిమాకి మార్కులు వేస్తున్నారు. యు.యస్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా ప్రభంజనం ఆరంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో యునానిమస్ హిట్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. భారీ వసూళ్లు సాధించి, కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మొత్తం మీద 'ఎన్టీఆర్ - కథానాయకుడు' బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇక 'ఎన్టీఆర్ - మహానాయకుడు' కోసం ఎదురుచూద్దాం.