డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్ రెడీ కొరటాల స్ర్కిఫ్ట్ కూడా రెడీ చేసాడు. 'సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా తాజా వార్తల ప్రకారం చిరుతో సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా కొరటాల మెగా కాంపౌండ్ ని వదిలే అవకాశంలేదు. ఎందుకంటే కొరటాలతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ డీల్ కుదుర్చుకున్నాడట. ఆ డీల్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (11.1.2019) థియేటర్స్ కి వస్తోంది. దీని తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు రాంచరణ్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే కొరటాలకు చిరు సినిమాకే కాకుండా తనతో చేయబోయే సినిమా కోసం కూడా అడ్వాన్స్ ఇచ్చేసాడట చరణ్. చిరు, కొరటాల సినిమా పూర్తయ్యేసరికి, రాజమౌళితో చరణ్ సినిమా చివరి దశకు చేరుకుంటుంది. ఆ వెంటనే కొరటాల, రాంచరణ్ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తుందట. ఈ డీల్ కి కొరటాల కూడా అంగీకరించేసాడట. సో... కొరటాలను రెండు సినిమాల కోసం చరణ్ లాక్ చేసాడన్నమాట. అంటే దాదాపు రెండేళ్లు మెగా కాంపౌండ్ దాటి కొరటాల బయటికి వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు. రాంచరణ్ సెట్టింగ్ అదిరింది కదూ...!