యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అదుర్స్' చిత్రం ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్ చేయడానికి రెడీ అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు. స్ర్కిఫ్ట్ రెడీ చేసి, సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళతానని వినాయక్ కూడా చెబుతుంటాడు. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సీక్వెల్ కి స్ర్కిఫ్ట్ రెడీ అయ్యిందట.
రైటర్ కోన వెంకట్ 'అదుర్స్' సీక్వెల్ కి స్ర్కిఫ్ట్ రెడీ చేసేసాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మరి స్ర్కిఫ్ట్ రెడీ అయ్యింది కాబట్టి.. ఎన్టీఆర్, వినాయక్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దృష్టి సారిస్తారేమో వేచిచూద్దాం.