లెజండరీ యాక్టర్, మహానాయకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్ బయోపిక్' ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకుదూసుకెళుతోంది. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండానే ఈ చిత్రం యూనిట్ షూటింగ్ లో మునిగిపోయింది.
'ఎన్టీఆర్ బయోపిక్' సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' కు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని కీలక నటీనటులు పాల్గొనగా హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించనుంది. ఫిబ్రవరి 7న భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రం యూనిట్.