యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RRR చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రెండో షెడ్యూల్ కి సంబంధించి తాజా అప్ డేట్ ఒకటి ప్రచారంలో ఉంది. అదేంటంటే...
ఈ నెల 21 నుంచి సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందట చిత్రం యూనిట్. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ ఈ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఈ ఇద్దరితో జత కట్టబోతున్న హీరోయిన్లు సైతం సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారని వార్తలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనే విషయంలో క్లారటీ లేదు. సో... సెకండ్ షెడ్యూల్ ఆరంభమవ్వగానే ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ల విషయం బయటికి వచ్చేస్తుందని ఊహించవచ్చు.