అగ్ర నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజుకు 2019 ఆరంభంలో వచ్చిన మిశ్రమ ఫలితాలు ఆనందం, దుఖం రెండింటిని ఒకేసారి అనుభవించేలా చేసింది. ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన 'F2' చిత్రం విడుదలై భారీ వసూళ్లను కురిపిస్తూ ముందుకు దూసుకెళుతోంది. ఈ సినిమాతో దిల్ రాజు భారీ లాభాలను చవిచూడబోతున్నాడు. అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేని విధంగా దిల్ రాజుకు 'వినయ విధేయ రామ' చిత్రం షాకిచ్చింది.
రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' చిత్రం నైజాం, ఉత్తరాంథ్ర పంపిణీ హక్కులను తీసుకున్నాడు దిల్ రాజు. నైజాం పంపిణీ హక్కులను మాత్రమే 18కోట్లు ఇచ్చి దక్కించుకున్నాడని సమాచారమ్. దీంతో పాటు ఉత్తరాంథ్ర హక్కులు. కాగా ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. ఫస్ట్ డే వసూళ్లు ఫర్వాలేదనిపించినా, రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గాయి. ప్రస్తుతం ఈ సినిమా కురిపిస్తున్న వసూళ్లను అంచనా వేస్తున్న ట్రేడ్ పండితులు దిల్ రాజు 10కోట్ల వరకూ నష్టాలను చవిచూసే అవకాశముందని అంటున్నారు. సో... వినయ విధేయ రామ నష్టాన్ని #F2 తో పూడ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద లాభం, నష్టం.. ఆనందం, దుఖం రెండూ ఒకేసారి చవిచూసేలా దిల్ రాజుకు 2019 ఆరంభమయ్యింది. మరి ఈ యేడాది దిల్ రాజు బ్యానర్ నుంచే వచ్చే సినిమాలు, పంపిణీ చేయబోతున్న సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూద్దాం.