యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RRR చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా వార్తల ప్రకారం ఈ నెల 21 నుంచి సెకండ్ షెడ్యూల్ ఆరంభంకానుందని తెలుస్తోంది.
ఈ సెకండ్ షెడ్యూల్ లో ముందుగా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట. రఫ్ లుక్ తో ఈ షెడ్యూల్ లో బరిలోకి దిగబోతున్న ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట రాజమౌళి. హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. రఫ్ లుక్ కోసం ఎన్టీఆర్ ఫిజిక్ పరమైన మార్పులు చేసాడట. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ లుక్ బయటికి లీక్ అవ్వకుండా చిత్రం టీం జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి, అధికారికంగా లుక్ విడుదల చేసేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.