14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్న చిత్రం 'ఆగడు'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం దిల్ రాజు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పెద్ద ఎత్తున పోటీ పడ్డారని వినికిడి. ఈ పోటీలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిదే పై చెయ్యి అవ్వడం విశేషం. ఈ సినిమా నైజాం హక్కుల కోసం దిల్ రాజు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పోటీ పడ్డారట. కానీ దిల్ రాజు కంటే ఎక్కువ మొత్తం ఇచ్చి ఈ సినిమా నైజాం హక్కులను కైవసం చేసుకున్నారట సుధాకర్ రెడ్డి. దాంతో దిల్ రాజు ఈ సినిమాకి సంబంధించి కేవలం ఉత్తరాంధ్ర హక్కులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 5కోట్లు ఆఫర్ ఇచ్చి దిల్ రాజు ఉత్తరాంధ్ర హక్కులను కైవసం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులు మిస్ అవ్వడం పట్ల దిల్ రాజు చాలా అసహనంగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంటే, శృతిహాసన్ ఐటమ్ పాటలో కనువిందు చేయనుంది.