డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్ రెడీ కొరటాల స్ర్కిఫ్ట్ కూడా రెడీ చేసాడు. 'సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఉన్నాయికానీ, ఎప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే దానిపై మాత్రం క్లారటీ లేదు. తాజా వార్తల ప్రకారం జూన్ నెలాఖరు లేదా జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమా కోసం శృతిహాసన్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కొరటాల దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రంలో శృతిహాసన్ నటించింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ నేపధ్యంలో కొరటాల, చిరు కాంబినేషన్ సినిమా కాబట్టి శృతిహాసన్ నో చెప్పే అవకాశంలేదని ఫిల్మ్ నగర్ టాక్.