'అరవిందసమేత వీరరాఘవ' తో చక్కటి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా వర్క్ తో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందనే వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి 'నాన్న.. నేను' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. తండ్రి, కొడుకు సెంటిమెంట్ నేపధ్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందట. అందుకే 'నాన్న.. నేను' టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని భావిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. బాలీవుడ్ నటుడు బొమ్మన్ ఇరానీని తండ్రి పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డె, క్యాథరీన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కన్ ఫార్మ్ అయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారమ్.