మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెస్త కమ్యూనిటీ (ఫిషర్ మ్యాన్స్) కి చెందిన బ్యాక్ డ్రాప్ తో ఈ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది.
కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ గా నటింపజేయడానికి డైరెక్టర్ సుకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. ఈ సినిమాలో నెగటివ్ రోల్ డిజైన్ చేసిన విధానం నచ్చడంతో విజయ్ సేతుపతి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.