యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్' ఫుల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 'బిగ్ బాస్ 2' కి కూడా ఎన్టీఆర్ ని హోస్ట్ గా వ్యవహరింపచేయడానికి ప్రయత్నాలు చేసారు. కానీ కుదరలేదు. న్యాచురల్ స్టార్ నానిని రంగంలోకి దింపారు. నాని హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 2' సక్సెస్ అయ్యింది. ఆఫ్ కోర్స్ కొన్ని విమర్శలు వచ్చాయనుకోండి.
తాజాగా 'బిగ్ బాస్-3' ని మళ్లీ ఎన్టీఆర్ తో హోస్ట్ చేయించాలని భావించిన నిర్వాహకులు భారీ పారితోషికం ఆఫర్ చేసారట. ముందు ఈ ఆఫర్ ని అంగీకరించిన ఎన్టీఆర్, ఇప్పుడు రిజెక్ట్ చేసాడట. #RRR సినిమాపైనే పూర్తిగా దృష్టి సారించాలని భావించిన ఎన్టీఆర్ 'బిగ్ బాస్ - 3' కి నో చెప్పాడట. ఈ నేపధ్యంలో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రచారమవుతున్న వార్తల ప్రకారం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను 'బిగ్ బాస్' నిర్వాహకులు అప్రోచ్ అయ్యారట. భారీ పారితోషికం ఆఫర్ చేసారట. విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్ 3' ని హోస్ట్ చేస్తే... షో సెన్నేషనల్ హిట్ అవ్వడం ఖాయయని భావిస్తున్నారట. మరి విజయ్ దేవరకొండ ఈ ఆఫర్ ని అంగీకరిస్తాడా వేచిచూడాల్సిందే.