కింగ్ నాగార్జున ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే... ఏ మాత్రం ఆలోచించకుండా హీరోయిన్ టబు పేరును తడుముకోకుండా చెప్పేస్తారు. అంతలా నాగ్, టబు మధ్య అనుబంధం ఉంది. ఓ సందర్భంలో టబు తన ఫేవరేట్ హీరోయిన్ అని చెప్పారు నాగ్. కాగా తాజా వార్తల ప్రకారం చాలా గ్యాప్ తర్వాత టబు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశముందని వార్తలు అందుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్ర కోసం టబుని తీసుకోవడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. 'అత్తారింటికి దారేది', 'అఆ', 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో తల్లి పాత్రలను త్రివిక్రమ్ తీర్చిదిద్దిన వైనం సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోని తల్లి పాత్రను కూడా త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దారట. ఈ పాత్ర ఒకప్పటి స్టార్ హీరోయిన్ తో చేయిస్తే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్, అందులో భాగంగా టబు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారమ్. మరి త్రివిక్రమ్ ప్రయత్నాలు ఫలించి అల్లు అర్జున్ తల్లిగా టబు నటిస్తుందా వేచిచూద్దాం.