రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'మిస్టర్ పర్ ఫెక్ట్', 'డార్లింగ్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ మరోసారి డార్లింగ్ ప్రభాస్ కోసం రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది. స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా చేయడానికి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారమ్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఓ షెడ్యూల్ యూరోప్ లో జరిగింది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో ప్రభాస్ పాల్గొనగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. కాగా కాజల్ అగర్వాల్ ని ఈ సినిమాలో స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ చేయించడానికి తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ సాంగ్ లో కాజల్ ఏ రేంజ్ లో మెరవనుందో వేచిచూద్దాం.