షూటింగ్ గ్యాప్ లో హీరోలు, హీరోయిన్లు విశ్రాంతి తీసుకోవడం కోసం కార్ వ్యాన్ ని అరేంజ్ చేస్తుంటారు నిర్మాతలు. అయితే కొంతమంది హీరోలు తమ అవసరాలకు అనుగుణంగా సొంతంగా కార్ వ్యాన్ ని తయారు చేయించుకుంటున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, హీరో వెంకటేష్ సొంత కార్ వ్యాన్ లనే వాడుతుంటారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నాడు.
అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో సొంతంగా కార్ వ్యానన్ ని రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. దాదాపు 2, 3 కోట్ల విలువైన వాహనం, 5కోట్ల విలువైన ఇంటర్నేషనల్ రేంజ్ ఇంటీరియర్ డిజైన్ తో అల్లు అర్జున్ కార్ వ్యాన్ రెడీ అవుతోందట. సినిమా షూటింగ్ ఆరంభం కాకముందే ఈ వ్యాన్ ని రెడీ చేయడానికి అల్లు అర్జున్ టీం ప్రయత్నాలు చేస్తోందట. సో... త్రివిక్రమ్ షూటింగ్ లో బిజీగా ఉండబోయే అల్లు అర్జున్ షూటింగ్ గ్యాప్ లో సొంత కార్ వ్యాన్ లో రెస్ట్ తీసుకోబోతున్నాడన్నమాట...!