డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్ రెడీ కొరటాల స్ర్కిఫ్ట్ కూడా రెడీ చేసాడు. 'సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ నెలాఖరులోపు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. జూన్ నెలాఖరు లేదా జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని సమాచారమ్. ఇదిలా ఉంటే...
ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆల్ రెడీ కీర్తితో కొరటాల సంప్రదింపులు జరుపుతున్నారట. కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. చిరు సరసన కూడా నటించింది. ఇప్పుడు కీర్తి సురేష్ కనుక కొరటాల సినిమాకి సైన్ చేస్తే చిరుతో రొమాన్స్ చేసే అవకాశం దక్కుతుంది. ఈ సినిమా కోసం నయనతార, శృతిహాసన్, అనుష్క ను హీరోయిన్లుగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారనే వార్తలు ఉన్నాయి. ఇప్పడు కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో వేచిచూడాల్సిందే.