సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెల 15 నుండి ఈ పాట చిత్రీకరణ జరగనుంది. మరోవైపు మహేష్ బాబు తన పాత్ర కోసం డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే...
ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. 12.6 కోట్లకు ఈ సినిమా సీడెడ్ హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక 'మహర్షి' సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ 11కోట్లుతో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శాటిటైల్ హక్కులను 16.8 కోట్లు ఆఫర్ ఇచ్చి జెమిని చానెల్ దక్కించుకుంది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. దీన్నిబట్టి ఈ సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.