డైరెక్టర్ వి.వి.వినాయక్ గత కొన్నాళ్లుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ క్లారటీ రాలేదు. మరోవైపు ఇద్దరు హీరోలతో సినిమాలు చేయడానికి డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రయత్నాలు చేసాడట. ఈ ఇద్దరూ హీరోలు ఎవరనే విషయంలోకి వెళితే...
హీరో వెంకటేష్, హీరో రవితేజతో సినిమాలు చేయడానికి వినాయక్ ప్రయత్నాలు చేసాడట. అయితే ప్రస్తుతం 'వెంకీమామ' తో బిజీగా ఉన్న వెంకటేష్ తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నేపధ్యంలో వచ్చే యేడాది వరకూ ఆగాల్సిందేనని వినాయక్ కి చెప్పాడట వెంకటేష్. ఇక రవితేజ విషయంలోకి వెళితే...
'తెరి' తెలుగు రీమేక్, 'డిస్కో రాజా' సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. వీటి తర్వాత వినాయక్ దర్శకత్వంలోని సినిమా గురించి ఆలోచించాలని భావిస్తున్నాడట. అంటే వచ్చే యేడాది వరకూ రవితేజ, వినాయక్ సినిమాపై క్లారటీ వచ్చే అవకాశం లేదు. సో... వినాయక్ కి ఈ ఇద్దరు హీరోలు ఇలా షాకిచ్చారు కాబట్టి, వచ్చే యేడాది వరకూ వెయిట్ చేస్తాడో లేక మరో హీరో కోసం ట్రై చేస్తాడో వేచిచూద్దాం.