యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో విలన్ గా నటించిన హీరో నవీన్ చంద్రకు బంపర్ ఆఫర్ తగిలింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 'అసురన్' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో నవీన్ చంద్రను విలన్ గా తీసుకున్నారు. ఇది నవీన్ చంద్రకు నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ ఆడియన్స్ ని ఈ సినిమాతో ఆలరించగలిగితే, నవీన్ చంద్రకు తమిళ సినిమా అవకాశాలు వస్తాయి. దాంతో నవీన్ చంద్ర కోలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశముంది. ఇక ఈ సినిమాలో నటించడం పట్ల ఫుల్ ఖుషీ గా ఉన్న నవీన్ చంద్ర హీరో ధనుష్ గురించి, ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే...
''ధనుష్ తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్ స్టార్ ఆయన. మే నెల నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతున్నాం.
ఈ షెడ్యూల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలా ట్రాన్స్ ఫర్మేషన్స్ ఉంటాయి. నా మేకోవర్ అందరినీ అలరిస్తుంది.
దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్ తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ తో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు నవీన్ చంద్ర.