డైరెక్టర్ వి.వి.వినాయక్ గత కొన్నాళ్లుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ క్లారటీ రాలేదు. మరోవైపు ఇద్దరు హీరోలతో సినిమాలు చేయడానికి డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రయత్నాలు చేసాడట. ఈ ఇద్దరిలో ఓ హీరోతో వినాయక్ కి సినిమా కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
మాస్ మహారాజా రవితేజకు వి.వి.వినాయక్ 'కృష్ణ' లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చాడు. తాజా వార్తల ప్రకారం వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వినాయక్ చెప్పిన ఓ స్టోరీ లైన్ రవితేజకు నచ్చిందట. దాంతో ఈ సినిమా చేయడానికి రవితేజ అంగీకరించాడని తెలుస్తోంది. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్. సో... రవితేజ, వినాయక్ కాంబినేషన్ లో మరో మాస్ సినిమాకి రంగం సిద్ధమవుతుందని ఊహించవచ్చు.