నాగార్జున మనవడిగా నాగచైతన్య నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరూ కలిసి ఏ సినిమాలో నటించబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే...
నాగ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సోగ్గాడే చిని నాయనా' లోని బంగార్రాజు క్యారెక్టర్ ని మెయిన్ గా తీసుకుని ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు నాగ్. 'సోగ్గాడే చిని నాయనా' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతోనే ఈ సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.
ఈ మధ్య డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ స్టోరీ లైన్ వర్కవుట్ చేసి నాగ్ కి చెప్పాడట. ఆ స్టోరీ లైన్ నాగ్ కి బాగా నచ్చిందట. ఈ స్టోరీ లైన్ ప్రకారం నాగార్జున మనవడి పాత్రను నాగచైతన్యతో చేయిస్తే బాగుంటుందని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల అనుకోవడం, నాగ్ తో చర్చించడం జరిగిందట. ఇందుకు నాగ్, నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. సో... అన్నీ కుదిరితే 'మనం' తర్వాత నాగ్, నాగచైతన్య కలిసి మరోసారి స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు.