స్టార్ డైరెక్టర్ రాజమౌళికి షాకిస్తూ 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి తప్పుకుంది హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్. దాంతో ఈమె స్థానంలో ఎవరినీ తీసుకుంటారా... ఎన్టీఆర్ తో జత కట్టబోయే హీరోయిన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.
తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రధ్దాకపూర్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రద్ధాదాస్ ఇప్పటికే ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటిస్తోంది. భారీ బడ్జెట్ తో టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మరో సినిమా 'ఆర్ఆర్ఆర్' లో నటించే అవకాశమంటే, అది కూడా ఎన్టీఆర్ సరసన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి నో చెప్పే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. మరి శ్రధ్దాదాస్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా వేచిచూద్దాం. శ్రద్ధాదాస్ ఈ సినిమా అంగీకరిస్తే... ఆర్ఆర్ఆర్ కి హీరోయిన్ ప్రాబ్లమ్ క్లియర్ అయినట్టే...!