మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' లో ఓ కీలక పాత్ర కోసం సునీల్ ని తీసుకున్నారని, డేట్స్ కుదరక ఈ సినిమాని సునీల్ వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలీదుగానీ, చిరు 151వ ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డిలో సునీల్ ఓ కీలక పాత్ర చేసాడని సమాచారమ్.
తాజాగా చిరు 152వ చిత్రం కోసం కూడా సునీల్ ని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరు 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 'సైరా' షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లానింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నాడట. హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత కామెడీ పాత్రలు, గెస్ట్ అఫియరెన్స్ లాంటివి చేయలేదు సునీల్. కానీ హీరోగా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ రూటు మార్చాడు. కీలక పాత్రలు, కామెడీ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఇప్పుడు చిరు 152 వ చిత్రం కూడా కమిట్ అయ్యాడని సమాచారమ్.