సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతిని కీలక పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆఫర్ ని విజయశాంతి తిరస్కరించిందనే వార్తలు హల్ చల్ చేసాయి. దాంతో విజయశాంతి రీ ఎంట్రీ లేనట్టేనని అందరూ ఫిక్స్ అయ్యారు.
అయితే తాజా వార్తల ప్రకారం విజయశాంతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. పాత్ర బాగుండటం, తల్లి పాత్ర కాకుండా సినిమాలో కీలకం కావడంతోనే ఈ సినిమా చేయడానికి విజయశాంతి అంగీకరించిందని సమాచారమ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.