'మహర్షి' చిత్రం తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని అందరూ భావించారు. కానీ అందరినీ షాక్ కి గురి చేస్తూ సుకుమార్ సినిమాని రిజెక్ట్ చేసాడు మహేష్. ఎందుకు ఈ సినిమాని మహేష్ రిజెక్ట్ చేసాడు... ఈ ఇద్దరి మధ్య నెలకొన్న మనస్ఫర్ధలు ఏంటీ అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. కాగా ప్రస్తుతం 'మహర్షి' ప్రమోషన్ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఈ విషయానికి సంబంధించి క్లారటీ ఇచ్చాడు.
'మహర్షి' తర్వాత ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేద్దామనుకున్నాను. కానీ సుకుమార్ సీరియస్ స్టోరీ లైన్ చెప్పాడు. అందుకే ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ లైన్ చెప్పిన అనిల్ రావిపూడి సినిమా ఒప్పుకుని, సుకుమార్ సినిమాని రిజెక్ట్ చేసాను. భవిష్యత్తులో సుకుమార్ తో సినిమా చేస్తాను అని స్ఫష్టం చేసాడు మహేష్ బాబు. సో... భవిష్యత్తులో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని ఊహించవచ్చు.