హీరోయిన్ రాశిఖన్నాతో ఆ కుర్ర హీరో డేటింగ్ లో ఉన్నాడని, మెగా డాటర్ నిహారిక కొణిదెలను ఆ కుర్ర హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు హల్ చల్ చేసాయి. ఆ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలీక ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తలకు సంబంధించి ఆ కుర్ర హీరో స్పందించాడు. ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరు అనుకుంటున్నారా... ఆ విషయంలోకే వెళదాం.
నాగశౌర్య కెరీర్ ప్రస్తుతం డల్ గా సాగుతోంది. సినిమాలు కమిట్ అయ్యాడుకానీ, ఆ సినిమాలు విడుదలై సక్సెస్ అయితేనే ఈ కుర్ర హీరో మళ్లీ సక్సెస్ బాట పట్టే అవకాశముంది. కాగా ఇటీవల యుట్యూబ్ ఇంటర్య్వూలో రాశిఖన్నాతో డేటింగ్, నిహారికతో పెళ్లి గురించి నాగశౌర్య స్పందించాడు. ఈ రెండు వార్తల్లోనూ నిజంలేదని స్ఫష్టం చేసాడు. ''అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు. దీనివల్ల మా మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఎందుకు ఆలోచించరు. ఇలా రాయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మా వైపు నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ వస్తే తప్ప, మా పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదు'' అంటూ మీడియాకి చురకలు అంటించాడు నాగశౌర్య. మరి ఇకనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడతాయా... వేచిచూద్దాం.