సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు 25 రోజుల తర్వాత మహేష్ బాబు ఇండియా తిరిగి రాబోతున్నాడని తెలుస్తోంది. 'మహర్షి' విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ బాబు తదుపరి సినిమా #మహేష్26 అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆ రోజు #మహేష్26 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. హాలీడ్ ట్రిప్ లో ఉన్న మహేష్ బాబు ఈ సినిమా ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యే అవకాశంలేదని తెలుస్తోంది. జూన్ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని సమాచారమ్. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా స్ర్కిఫ్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నారట. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి ఎలాగైనా డేట్స్ అడ్జెస్ట్ చేసి, మహేష్ బాబుతో రొమాన్స్ చేసే అవకాశాన్ని వదులుకోకూడదని గట్టి ప్రయత్నాలు చేస్తోందట హీరోయిన్ రక మందన్నా.