స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి రేస్ లో ఈ సినిమా నిలిస్తే... బాలయ్య, మహేష్ బాబు, రజనీకాంత్ ల సినిమాలతో ఈ సినిమా పోటీ పడాల్సి ఉంటుంది. ఇదే కనుక జరిగితే మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, కె.యస్.రవికుమర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా కూడా 2020 సంక్రాంతి రేస్ లో ఉంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్ ల 'దర్బార్' సినిమా కూడా 2020 సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది.
సో... 2020 సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. మరి ఈ పోటీలో పై చెయ్యి ఎవరిదో, ఫైనల్ గా ఎన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయో లేదో వేచిచూద్దాం.