కోలీవుడ్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం పంజాబ్ బ్యూటీ మెహ్రీన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. నిర్మాత కళ్యాణ్, డైరెక్టర్ రవికుమార్ ఆల్ రెడీ మోహ్రీన్ తో చర్చలు జరిపారని వార్తలు అందుతున్నాయి. మరి మెహ్రీన్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచిచూడాలి. ఇదిలా ఉంటే...
బాలయ్య ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్ప పాత్రలో అలరించనున్నారని తెలుస్తోంది. ఎస్.పి రంజిత్ కుమార్ రానా పాత్రలో కనువిందు చేయనున్న బాలయ్య, ఈ పాత్ర కోసం 20 కిలోలు బరువు తగ్గనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్నినిర్మించనున్నారు.