2018, జూన్ 14న ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బుడతడకి భార్గవ రామ్ అని పేరు పెట్టి తాత ఎన్టీఆర్ మీద తనకున్న ప్రేమ, భక్తిని చాటుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ రోజు భార్గవ రామ్ ఫస్ట్ బర్త్ డే.
ఈ సందర్భంగా భార్గవ రామ్ తో దిగిన ఫోటోను, అభయ్ రామ్, భార్గవ రామ్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి భార్గవ రామ్ పుట్టినరోజు కానుక అందించాడు ఎన్టీఆర్. ఈ ఫోటోలను ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఆనందపడిపోతున్నారు. #HappyBirthdayBhargavaRam అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. చూడచక్కగా ఉన్న అభయ్ రామ్, భార్గవ రామ్ ని చూసి 'ఎన్టీఆర్ ఫ్యామిలీ' పరిపూర్ణమైన ఫ్యామిలీ అంటూ ఎన్టీఆర్ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న భార్గవ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.