ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజు మెగాభిమానుల కోసం బిగ్ సర్ ప్రైజింగ్ ఉండబోతోంది. ఏంటా అనుకుంటున్నారా... 'సైరా' నరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రం యూనిట్. ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏం ఉంటుంది చెప్పండి. ఇదిలా ఉంటే...
ట్రైలర్ అదిరిపోయేలా ఉండాలని నిర్మాత, మెగా పవర్ స్టార్ రాంచరణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చెప్పాడట. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేయాలని కూడా చరణ్ అంటున్నాడట. దాంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ట్రైలర్ కోసం కసరత్తులు మొదలుపెట్టారట. ఇంకా టైం ఉంది కాబట్టి, అదిరిపోయే లెవెల్లో ట్రైలర్ కట్ చేసి, మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి దృష్టి సినిమాపై పడేలా చేయాలని ఫిక్స్ అయ్యారట. సో... మెగాభిమానులకు 'సైరా' ట్రైలర్ తో పెద్ద గిఫ్ట్ అందబోతోందని చెప్పొచ్చు. గాంధీ జయంతి సందర్భంగా ఆక్టోబర్ 2న సినిమాని విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తమన్నా, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.