'మజిలీ' హిట్ నాగచైతన్యలో చాలా కాన్ఫిడెన్స్ నింపింది. దర్శక, నిర్మాతలు కూడా నాగచైతన్యను చూసే విధానంలో మార్పు వచ్చింది. మంచి క్యారెక్టర్ పడితే ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేయగలడో 'మజిలీ' ద్వారా నిరూపించుకున్నాడు నాగచైతన్య. దర్శకులు సైతం నాగచైతన్య కోసం మంచి కథలు రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు నాగచైతన్య. ఈ సినిమాకంటే ముందు దిల్ రాజు నిర్మాతగా నాగచైతన్య హీరోగా కొత్త దర్శకుడి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లానింగ్ జరిగింది. త్వరలో ఈ సినిమాని లాంఛ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడు. అయితే ఈ సినిమాని పక్కన పెట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాని ముందు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట నాగచైతన్య. ఇలా ప్లాన్ చేసుకోవడానికి కారణం ఉందని తెలుస్తోంది.
ఓవర్ సీస్ లో నాగచైతన్య మార్కెట్ పెరగడంలేదు. ఇక్కడ హిట్ కొట్టిన 'మజిలీ' కూడా ఓవర్ సీస్ లో 'ప్రేమమ్' కంటే తక్కువ వసూళ్లనే సాధించగలిగింది. శేఖర్ కమ్ములకు ఓవర్ సీస్ లో క్రేజ్ ఉంది. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ములతో సినిమా చేయడం వల్ల ఓవర్ సీస్ లో తన మార్కెట్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నాడట నాగచైతన్య. అందులో భాగంగానే శేఖర్ కమ్ముల సినిమాని ముందుకు తీసుకువచ్చాడని తెలుస్తోంది. ఆగస్ట్ లోనే నాగచైతన్య, శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారమ్.