ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ గురించి ఓ వార్త ప్రచారమవుతోంది. ఈ హీరోగారు డైరెక్టర్ ని పని చేసుకోనివ్వకుండా, అతని పనిలో వేలుపెడుతూ తెగ విసిగిచ్చేస్తున్నాడట. దాంతో సదురు డైరెక్టర్ అలిగి, వర్క్ కి దూరంగా ఉంటున్నాడట. ఏ సినిమా విషయంలో ఇలా జరుగుతుందో తెలుసా...
విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఎడిటింగ్ లో ఇన్ వాల్వ్ అయిపోయి... ఏ సీన్ ఉంచాలో, ఏది తీసేయాలో విజయ్ దేవరకొండ చెబుతున్నాడట. ఇలా ఇన్ వాల్వ్ అవ్వడం డైరెక్టర్ కి చాలా ఇబ్బందిగా ఉందట. అయినా సరే విజయ్ దేవరకొండ డైరెక్టర్ గురించి పట్టించుకోకుండా, పూర్తిగా ఇన్ వాల్వ్ అయిపోతున్నాడట. దాంతో విసిగిపోయిన డైరెక్టర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడట. డైరెక్టర్ దూరంగా ఉంటున్నప్పటికీ, విజయ్ దేవరకొండ ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడట. పైగా ఏం వర్క్ జరుగుతుందనే విషయాన్ని డైరెక్టర్ కి వాట్సప్ ద్వారా అప్ డేట్ ఇస్తున్నాడట. కర్ర విరక్కుండా, పాము చావకుండా విజయ్ దేవరకొండ తెలివిగా బిహేవ్ చేస్తుంటే, డైరెక్టర్ కి ఏం చేయాలో తెలీక తల పట్టుకుంటున్నాడట.
అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో, ఓవర్ ఇన్ వాల్వ్ మెంట్ మంచిదికాదని, ఇలా అయితే యంగ్ డైరెక్టర్స్ విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ఇష్టపడరని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మరి తన గురించి ఇంతలా ప్రచారమవుతోంది కాబట్టి, ఇప్పటికైనా విజయ్ తన తీరుని మార్చుకుంటాడేమో వేచిచూద్దాం.