యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న 'రణరంగం' చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి కథానాయిక. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్ర చేస్తోంది. ఈ రోజు (19.6.2019) కాజల్ బర్త్ డే. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ కాజల్ అగర్వాల్ నూతన ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు.
ఈ ప్రచార చిత్రంలో కాజల్ అగర్వాల్ లుక్ చాలా బాగుంది. యూత్ ఫుల్ లుక్ తో ఛార్మింగ్ గా ఉన్న కాజల్ అగర్వాల్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందా అనే చర్చకు తావిస్తోంది. చక్కటి నవ్వుతో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న కాజల్ అప్ కమింగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు.
ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.