'హని ఈజ్ ది బెస్ట్..' అంటూ డిఫరెంట్ మ్యానరజిమ్ తో 'ఎఫ్ 2' చిత్రం ద్వారా ఆడియన్స్ ని అలరించింది మెహ్రీన్. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న మెహ్రీన్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో రొమాన్స్ చేయబోతోంది. ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్, మెహ్రీన్ జత కట్టబోతున్న సినిమా ప్రారంభోత్పవం ఈ రోజు జరిగింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
'118' సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నశ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. గోపీ సుందర్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాకి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ గుప్తా నిర్మాత. జూలై 24 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్, రాజమండ్రి, ఊటీ లో నిరవధికంగా ఈ సినిమా షూటింగ్ జరగనుంది.