పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అబ్బాయ్ రాంచరణ్ తో సినిమా చేయడానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయాలు మాత్రం ప్రకటించలేదు. తాజాగా మళ్లీ ఈ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని రాంచరణ్ కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేయమని అడిగాడట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్న ప్రకారం 2020 చివరిలో త్రివిక్రమ్, రాంచరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్. ఆర్ఆర్ఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమానే చేయాలని రాంచరణ్ కూడా భావిస్తున్నాడట. సో... అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్ నిర్మాతగా రాంచరణ్ హీరోగా సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇది మెగాభిమానులను సంతోషపెట్టే వార్త అని ప్ర్యతేకంగా చెప్పక్కర్లేదు.