నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15నుంచి ఆరంభంకానుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ ని బీహార్ లో ప్లాన్ చేసారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ ఎపిసోడ్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి 'రూలర్' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్ప పాత్రలో అలరించనున్నారట. ఎస్.పి రంజిత్ కుమార్ రానా పాత్రలో కనువిందు చేయనున్న బాలయ్య, ఈ పాత్ర కోసం 20 కిలోలు బరువు తగ్గనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. మరొకటి గ్యాంగ్ స్టర్ పాత్ర అని సమాచారమ్. పవర్ ఫుల్ పోలీసాఫీసర్.. గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు అనేదే ఈ చిత్ర కథ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకురావడానికి నిర్మాత సి.కళ్యాణ్, డైరెక్టర్ రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు.