అఖిల్ అక్కినేని తదుపరి సినిమా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెలలోనే ఆరంభంకానుంది. కాగా ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట. తాజా వార్తల ప్రకారం తమిళ్ డైరెక్టర్, నటుడుని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
తమిళ్ డైరెక్టర్, నటుడు సముద్రఖని తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయస్థుడే. ధనుష్, కార్తీ తెలుగు డబ్బింగ్ చిత్రాల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు సముద్రఖని. ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' లో కీలక పాత్ర చేస్తున్నాడు సముద్రఖని. తాజాగా అఖిల్ సినిమా కోసం సముద్రఖని ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసాడట డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఆ పాత్ర ఏంటీ, ఎలా ఉంటుందనే విషయం తెలీడంలేదుగానీ, సినిమాలో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో కూడా తనకు అవకాశాలు రావడం పట్ల సముద్రఖని ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ఈ రెండు సినిమాలు తనకు బంపర్ ఆఫర్లుగా భావిస్తున్నాడట.
ఇక హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఫైనల్ గా అఖిల్ తో రొమాన్స్ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సిందే.