డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే యేడాది థియేటర్స్ కి రానుంది. కాగా తాజా వార్తల ప్రకారం చిరుతో సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా కొరటాల మెగా కాంపౌండ్ ని వదిలే అవకాశంలేదు. ఎందుకంటే కొరటాలతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ డీల్ కుదుర్చుకున్నాడట. ఆ డీల్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడట రాంచరణ్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చరణ్, కొరటాల మధ్య చర్చలు కూడా జరిగాయట. ఆల్ రెడీ కొరటాలకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట చరణ్. ఈ డీల్ కి కొరటాల కూడా అంగీకరించాడట. సో... కొరటాలను రెండు సినిమాల కోసం లాక్ చేసాడన్నమాట చరణ్. అంటే దాదాపు రెండేళ్లు మెగా కాంపౌండ్ దాటి కొరటాల బయటికి వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు. రాంచరణ్ ప్లాన్ అదిరింది కదూ...!