సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని ఓ పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్న విషయం తెలిసిందే. జగపతిబాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే కారణాలు బయటికి రాలేదుగానీ, ఈ సినిమా నుంచి జగపతిబాబు తప్పుకున్నాడు.
తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో తన కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ జగపతిబాబుకు నచ్చలేదట. పైగా పాత్ర నిడివి విషయంలో కూడా జగపతిబాబు బాగా అప్ సెట్ అయ్యాడట. అందుకే ఈ సినిమా నుంచి జగపతిబాబు తప్పుకున్నాడని సమాచారమ్. ప్రస్తుతం జగపతిబాబు నో చెప్పిన ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. మరి జగపతిబాబు వదిలేసిన ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ యస్ చెబుతాడా వేచిచూద్దాం.