ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం నిన్న (18.7.2019) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు. వసూళ్ల పరంగా కూడా విజృంభిస్తోంది. ఫస్ట్ టైమ్ రామ్, పూరి కాంబినేషన్ ఈ సినిమాకి సెట్ అయ్యింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మించి ఈ సినిమా వసూళ్లు సాధిస్తోంది. రామ్, పూరి ఇద్దరూ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇక ఫస్ట్ డే ఆంధ్రా, తెలంగాణాలో ఈ సినిమా సాధించిన షేర్ వివరాలు మీ కోసం...
నైజాం - 3.43 కోట్లు
సీడెడ్ - 1.20 కోట్లు
వైజాగ్ - 0.86 కోట్లు
ఈస్ట్ - 0.50 కోట్లు
వెస్ట్ - 0.40 కోట్లు
కృష్ణా - 0.53 కోట్లు
గుంటూరు - 0.57 కోట్లు
నెల్లూరు - 0.30 కోట్లు
టోటల్ ఏ.పి, తెలంగాణా ఫస్ట్ డే షేర్ - 7.83 కోట్లు