'ఇస్మార్ట్ శంకర్' తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ రెండు నెలలు లాంగ్ లీవ్ తీసుకోబోతున్నాడు. ఈ రెండు నెలలో పూరి ఏం చేయబోతున్నాడో తెలుసా...
ఫిట్ సెన్ పై శ్రద్ధ పెట్టబోతున్నాడట. వర్కవుట్లు చేసి శరీరాకృతిని మార్చుకోవాలనుకుంటున్నాడట. పాత పూరిలాగా ఉండాలనుకుంటున్నాడట. పాత పూరి ఎలా ఉండేవాడో అందరికీ తెలిసిన విషయమే. కెరీర్ బిగినింగ్ నుంచి చాలా హుషారుగా, వర్క్ మీద కాన్ సెన్ ట్రేట్ చేస్తూ... హిట్స్ మీద హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. కానీ 'టెంపర్' తర్వాత పూరికి సక్సెస్ లు పడలేదు. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్' తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ నేపధ్యంలో పాత పూరిలా మేకోవర్ అవ్వాలనుకుంటున్నాడట పూరి. అందుకే రెండు నెలలు రిలాక్స్ అయిపోయి, వర్కవుట్లు చేసి శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు సినిమాల పరంగా కూడా ఫుల్ కాన్ సెన్ ట్రేట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా పూరి చెప్పాడు. సో... 'ఇస్మార్ట్ శంకర్' తో 'పూరి ఈజ్ బ్యాక్' అని ఫిక్స్ అయిపోవచ్చు.