స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19న సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ 20వ సెట్స్ పైకి వెళ్లనుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ 20వ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభంకానుందట. ఇదిలా ఉంటే...
త్రివిక్రమ్, అల్లు అర్జున్... సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతున్నాయి. ఆర్య, ఆర్య 2 చిత్రాలు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కాయి. ఇప్పుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ 19వ సినిమా, సుకుమార్ తో అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందనున్నాయి. మరి ముచ్చటగా మూడోసారి కలుస్తున్న ఈ కాంబినేషన్ సినిమాలు అల్లు అర్జున్ కి ఏ రేంజ్ విజయాన్ని అందించనున్నాయో వేచిచూద్దాం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది.