మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు చిరు. ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే...
చిరు సినిమాలో చరణ్ గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నాడట. చరణ్ కోసం ఓ అద్భుతమైన గెస్ట్ రోల్ ని క్రియేట్ చేసాడట కొరటాల. చిరు, చరణ్ తెరపై కనిపిస్తే, మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. 'మగధీర', 'బ్రూస్ లీ' చిత్రాల్లో చరణ్ కోసం చిరు గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చారు. 'ఖైదీ నెం.150' లో చిరుతో కలిసి చరణ్ డ్యాన్స్ చేసాడు. ఇప్పుడు చిరు సినిమాలో చరణ్ గెస్ట్ అఫియరెన్స్ ఇస్తే... మెగా ఫ్యాన్స్ కి ఇది స్వీట్ షాక్ లా ఉంటుందని ప్ర్తత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో వేచిచూడాల్సిందే.