స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనే టార్గెట్ తో చిత్రం యూనిట్ ఉంది. కాగా ఈ సినిమా కోసం ఓ ఐటమ్ సాంగ్ ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్.
అయితే ఈ సినిమాకి ఐటమ్ సాంగ్ అవసరంలేదు అంటున్నాడట బన్ని (అల్లు అర్జున్). తండ్రి, కొడుకు సెంటిమెంట్ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రన్నింగ్ ఫ్లో ని దెబ్బతీస్తుందని అల్లు అర్జున్ అంటున్నాడట. పర్ ఫెక్ట్ ఫ్లో లో సినిమా వెళుతున్నప్పుడు ఐటమ్ సాంగ్ స్పీడ్ బ్రేకర్ లా అడ్డం తగిలినట్టు ఉంటుందని, కాబట్టి ఈ సినిమాకి ఐటమ్ సాంగ్ వద్దని అంటున్నాడట అల్లు అర్జున్. మరి త్రివిక్రమ్ ఇందుకు ఒప్పుకుంటాడా... లేక ఐటమ్ సాంగ్ ని పొందుపరుస్తాడా వేచిచూడాల్సిందే.