డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం 'వాల్మీకి' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ కి వస్తోంది. కాగా మీడియాతో 'వాల్మీకి' చిత్రానికి సంబంధించి బోల్డన్ని విశేషాలు తెలియజేసిన హరీష్ శంకర్ 'రామయ్య వస్తావయ్యా' సినిమా గురించి కూడా ప్రస్తావించాడు. ఆ వివరాల్లోకి వెళితే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్యా' చిత్రానికి దర్శకత్వం వహించాడు హరీష్ శంకర్. నిజం చెప్పాలంటే ఇది హరీష్ శంకర్ కి గోల్డెన్ ఛాన్స్. కానీ ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు హరీష్ శంకర్. 'రామయ్య వస్తావయ్యా' ఫ్లాప్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని, ఎప్పటికైనా ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇవ్వాలనేది తన టార్గెట్ అని 'వాల్మీకి' సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో వెల్లండిచాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మరి హరీష్ శంకర్ కి ఎన్టీఆర్ మరో అవకాశమిస్తాడా... వేచిచూద్దాం.