మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ అచంట, గోపి అచంట నిర్మించిన 'గద్దలకొండ గణేష్' చిత్రం నిన్న (20.9.2019) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తొలి షో తోనే హిట్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకెళుతున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. వరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'గద్దలకొండ గణేష్' నమోదయ్యింది.
నైజాంలో 1.7 కోట్లు షేర్ సాధించి ట్రేడ్ వర్గాల అంచనాలను సైతం మించేలా చేసింది 'గద్దలకొండ గణేష్'. వరుణ్ తేజ్ సోలో గా నటించిన సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం తన కెరీర్ కి ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మార్కెట్ కూడా పెరిగిపోతుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ వీకెండ్ బారీ వసూళ్లు సాధించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.
వరుణ్ తేజ్ తెలంగాణా స్లాంగ్, తన మ్యానరిజమ్ ఆడియన్స్ కి బాగా నచ్చడం వల్లే 'గద్దలకొండ గణేష్' ఈ రేంజ్ విజయాన్ని అందుకోగలిగింది. తమిళ్ సినిమా 'జిగర్తాండ' కి తెలుగు రీమేక్ అయినప్పటికీ, డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యేలా ఈ సినిమాకి చేసిన మార్పులు బాగా కలిసొచ్చాయి. మొత్తం మీద వరుణ్ తేజ్, హరీష్ శంకర్ భారీ విజయాన్ని అందుకున్నారని చెప్పక తప్పదు.