'అలా వైకుంఠపురంలో' చిత్రం విజయంలో ఆడియో ఆల్బమ్ ఎంతటి పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్ అందించిన పాటలు యుట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి. తమన్ ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమాకి తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతోన్న 'టక్ జగదీష్' సినిమాకి తమన్ పాటలందిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కొన్న మెలోడి ట్యూన్స్ ని ప్లాన్ చేసాడట. తమన్, శివ నిర్వాణ ఈ వర్కతోనే బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి అద్భుతమైన పాటలందించి మరోసారి తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట తమన్. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని హోమ్లీ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.